ఈ యాప్ మీ మొబైల్ లో ఉందా..ఇక అంతే సంగతులు

ఈ యాప్ మీ మొబైల్ లో ఉందా..ఇక అంతే సంగతులు

చేతిలో ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్, అందులో ఇంటర్నెట్‌ ఉందంటే చాలు. గూగుల్ ప్లే స్టోర్‌లోకి వెళ్ల‌డం. ఏదో ఒక యాప్‌ను వెత‌క‌డం, ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేసుకోవ‌డం ఇప్పుడు ఎక్కువై పోయింది. అయితే అందుకు కార‌ణ‌మూ లేక‌పోలేదు. ఎక్కడో స‌ద‌రు యాప్‌ను చూడ‌డం జరుగుతుంది, లేదంటే ఎవ‌రో చెప్తారు, ఇంకెక్క‌డైనా చూస్తారు, ఫోన్ చేతిలోకి వ‌చ్చాక అందులో ఇన్‌స్టాల్ చేసేస్తారు. దాన్ని భేషుగ్గా వాడేస్తుంటారు. అయితే ఆ యాప్ మ‌న‌కు లాభం క‌లిగిస్తుందా, న‌ష్టం చేకూరుస్తుందా, దాంతో మ‌నకు ఏదైనా అపాయం ఉంటుందా? అని మాత్రం స్మార్ట్‌ఫోన్ యూజ‌ర్లు ఆలోచించ‌డం లేదు. ఈ క్ర‌మంలో హ్యాక‌ర్లు కూడా ప‌లు యాప్స్‌ను తయారు చేస్తూ అందిన కాడికి వినియోగ‌దారుల స‌మాచారాన్ని త‌స్క‌రించ‌డం మొద‌లు పెట్టారు. ఒక్కో సంద‌ర్భంలో కొంద‌రు డ‌బ్బులు పోగొట్టుకున్న దాఖ‌లాలు కూడా ఉన్నాయి. కాగా గూగుల్ కూడా త‌న ప్లే స్టోర్‌లో ఉన్న యాప్స్ అన్నింటినీ చెక్ చేయ‌డం లేదు. దీంతో యూజర్లు త‌మంత‌ట తామే ఏ యాప్ ప్ర‌మాద‌క‌ర‌మో తెలుసుకోవాల్సిన ఆవ‌శ్య‌క‌త ఏర్ప‌డింది. అయితే కింద ఇచ్చిన కొన్ని యాప్స్ కూడా స‌రిగ్గా పైన చెప్పిన హ్యాకింగ్ త‌ర‌హాకు చెందిన‌వే. ఈ యాప్స్ గ‌న‌క మీ ఫోన్‌లో ఉంటే వెంట‌నే తీసేయండి. ఎందుకైనా మంచిది.

క్విక్ పిక్ (QuickPic)…
ఇది ఓ ఫొటో గ్యాలరీ యాప్‌. దీన్ని చీతా మొబైల్స్ సంస్థ డెవ‌ల‌ప్ చేస్తోంది. కాగా ఇటీవలి కాలంలో ఈ సంస్థ క్విక్ పిక్ యాప్ ద్వారా యూజ‌ర్ల ఫోన్ల‌లో ఉన్న స‌మాచారాన్నంతా త‌న స‌ర్వ‌ర్ల‌కు చేరవేస్తున్న‌ట్టు గుర్తించారు.
ఈ క్ర‌మంలో ఈ యాప్‌ను ఫోన్‌లో ఉంచుకోవ‌డం క‌న్నా తీసేయ‌డ‌మే బెట‌ర్‌. లేదంటే మీ స‌మాచార‌మంతా ఇత‌రుల చేతుల్లోకి వెళ్లిపోతుంది.





ఈఎస్ ఫైల్ ఎక్స్‌ప్లోర‌ర్ (ES File Explorer)
ఈ యాప్ వ‌ల్ల బ్లోట్‌వేర్‌, యాడ్‌వేర్‌ల రూపంలో వైర‌స్‌లు ఆండ్రాయిడ్ ఫోన్ల‌లోకి ప్ర‌వేశిస్తున్నాయ‌ట‌. కాబ‌ట్టి ఈ యాప్ మీ ఫోన్‌లో ఉన్నా వెంట‌నే తీసేయండి.




యూసీ బ్రౌజ‌ర్ (UC Browser)
వేగవంత‌మైన ఇంట‌ర్నెట్ బ్రౌజ‌ర్‌గా ఈ యాప్ ఎంతో గుర్తింపు పొందింది. ఇంటర్నెట్‌ను వేగంగా బ్రౌజ్ చేసేందుకు ఈ యాప్ ఉప‌యోగ‌ప‌డుతుంది. కాక‌పోతే అలా చేసే క్ర‌మంలో ఇంట‌ర్నెట్ స్పీడ్‌నంతా కంప్రెస్ చేస్తుంది.

దీంతో ఇత‌ర యాప్‌ల‌కు ఆటంకం క‌లుగుతుంది. కాబ‌ట్టి ఈ యాప్‌ను కూడా మీ డివైస్ నుంచి తీసేయండి.



క్లీన్ ఇట్ (CLEAN It)
డివైస్‌లో పేరుకుపోయిన జంక్ ఫైల్స్‌ను క్లీన్ చేసేందుకు దీన్ని వాడతారు. కానీ అలా క్లీన్ చేసే క్ర‌మంలో ఈ యాప్ పెద్ద ఎత్తున బ్యాట‌రీని వాడుకుంటుంది.
దీంతో బ్యాట‌రీ ప‌వ‌ర్‌లో స‌మ‌స్య‌లు వ‌స్తాయి. క‌నుక ఈ యాప్ కూడా ఉండ‌కూడ‌దు.


మ్యూజిక్ ప్లేయ‌ర్ (Music Player)
ఈ యాప్ ఆండ్రాయిడ్ డివైస్‌ల‌న్నింటిలోనూ డిఫాల్ట్‌గా వ‌స్తోంది. దీన్ని వాడ‌డం వ‌ల్ల డివైస్ బ్యాట‌రీ ఎక్కువ‌గా ఖ‌ర్చ‌వుతుంది. అదే స‌మ‌యంలో ఇంట‌ర్నెట్‌కు క‌నెక్ట్ అయి ఉంటే పెద్ద మొత్తంలో డేటాను వాడుతుంది. కాబ‌ట్టి ఈ యాప్‌ను తీసేయండి.
డ్యు బ్యాట‌రీ సేవ‌ర్ అండ్ ఫాస్ట్ చార్జ్ (DU battery saver & fast charge)
మీ ఆండ్రాయిడ్ ఫోన్‌లో ఎప్ప‌టి క‌ప్పుడు ఏదో ఒక అడ్వ‌ర్ట‌యిజ్‌మెంట్ వ‌స్తూ మిమ్మల్ని విసిగిస్తోందా? యాప్స్ వాటంత‌ట అవే ఇన్‌స్టాల్ అవుతున్నాయా? అయితే అందుకు డ్యు బ్యాట‌రీ యాపే కార‌ణం. ఆ యాప్‌ను వెంట‌నే తీసేస్తే పైన చెప్పిన స‌మ‌స్య పోతుంది.



డాల్ఫిన్ బ్రౌజ‌ర్ (Dolphin browser)
ఆండ్రాయిడ్ డివైస్‌ల‌ను వాడుతున్న యూజ‌ర్లు ఈ యాప్‌ను గ‌న‌క ఇన్‌స్టాల్ చేసుకుంటే దాంతో యూజ‌ర్ స‌మాచార‌మంతా ఆ యాప్ స‌ర్వ‌ర్ల‌లోకి చేరిపోతుంది.

అంతేకాదు, యూజ‌ర్ ఇంట‌ర్నెట్‌లో ద‌ర్శించే సైట్ల వివ‌రాల‌న్నీ ఆ యాప్ ఓన‌ర్ల‌కు అందుతాయి.


_IF YOU LIKE THIS POST PLEASE LIKE AND SHARE

_YOU CAN SEE THIS POST IN ENGLISH VERSION, JUST CLICK TRANSLATE TAB ON MY BLOG AND SEE THIS IN YOUR PREFERRED LANGUAGE