వాహనదారులకు శుభవార్త. ప్రతిసారి మనం డ్రైవింగ్ లైసెన్స్(డీఎల్),
రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్(ఆర్ సీ) లను ఇంట్లో మర్చిపోతుంటాం. మర్చిపోయిన
ప్రతిసారి ఫైన్ కడుతూ ఉంటాం. ఇక ఇప్పటినుంచి అలాంటి సమస్యలు ఉండవు.
ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం త్వరలో 'డిజీ లాకర్' యాప్ ను ప్రవేశపెట్టనుంది. ఈ
యాప్ ద్వారా మనం ఏ ప్రాంతం నుంచి అయినా మొబైల్ ను ఉపయోగించి డీఎల్, ఆర్ సీ
లను చూసుకోవచ్చు. ట్రాఫిక్ పోలీసులు, ఇతర ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలు యాప్
ద్వారా వ్యక్తుల వివరాలను కూడా తెలుసుకోవచ్చని ప్రభుత్వ అధికారి ఒకరు
తెలిపారు.
ప్రతి ఒక్కరు 'డిజీ లాకర్'లో అకౌంట్ ఓపెన్ చేయడానికి ఆధార్ కార్డు నంబర్ ను మొబైల్ నంబర్ తో అనుసంధానం చేయాల్సి వుంటుందని చెప్పారు. ఈ యాప్ ను ఐటీ, రవాణా శాఖల మంత్రులు బుధవారం విడుదల చేయనున్నారు. డీఎల్, ఆర్ సీల్లో ఏవైనా తేడాలు ఉంటే పెనాల్టీ పాయింట్లను జోడించే వెసులుబాటు కూడా ఇందులో ఉంది. తెలంగాణ, ఢిల్లీ రాష్ట్రాలు ఈ-చలాన్లు జారీ చేయడంలో దేశంలోనే ముందున్నాయి.