మీ జియో సిమ్ నిమిషాల్లో యాక్టివేట్ కావాలంటే ఇలా చేయండి..


      సెప్టెంబర్ 5వ తేదీ నుంచి రిలయన్స్ జియో నెట్‌వర్క్ అందిరికి అందుబాటులోకి వచ్చేసింది. 4జీ స్మార్ట్‌ఫోన్‌ను ఉపయోగించుకునే ప్రతి ఒక్కరు ఈ సిమ్ పొందేందుకు అర్హులు.
ఈ సిమ్‌తో పాటు జియో అందిస్తోన్న వెల్‌కమ్ ఆఫర్‌లో భాగంగా డిసెంబర్ 31, 2016 వరకు జియో సేవలను ఉచితంగా పొందవచ్చు. జియో సిమ్‌లకు దేశవ్యాప్తంగా హైడిమాండ్ నెలకొనటంతో కొందరు ఈ సిమ్‌ను సొంతం చేసేకునేందుకు నానా తంటాలు పడుతున్నారు. కొంత మంది దగ్గర సిమ్ రెడీగా ఉన్నప్పటికి యాక్టివేషన్ ప్రక్రియ చాలా లేటవుతోంది.
* ఈ నేపధ్యంలో రిలయన్స్ జియో e-KYC activation పేరుతో సరికొత్త సర్వీసును లాంచ్ చేసింది. ఇ-కేవైసీ యాక్టివేషన్ పద్ధతిలో భాగంగా మీ జియో సిమ్ కార్డ్ కేవలం 15 నిమిషాల వ్యవధిలో యాక్టివేట్ కాబడుతుంది.
* ఇ-కేవైసీ యాక్టివేషన్ అనేది టెలికామ్ ఆపరేటర్లు తీసుకువచ్చిన సరికొత్త యాక్టివేషన్ పద్ధతి. ఈ ప్రక్రియ ద్వారా కొత్త సిమ్ కార్డ్ యాక్టివేషన్ 15 నిమిషాల్లో పూర్తవుతుంది.
* ఇ-కేవైసీ యాక్టివేషన్ ప్రక్రియలో భాగంగా జియో సిమ్‌ను యాక్టివేట్ చేసుకునేందుకు యూజర్ ఆధార్ కార్డ్‌తో పాటు పాస్‌పోర్ట్ సైజ్ కలర్ ఫోటో అవసరమవుతుంది.
* ప్రస్తుతానికి రిలయన్స్ e-KYC activation సర్వీస్ అన్ని ప్రధాన నగరాల్లో అందుబాటులో ఉంది. మీ సమీపంలోని రిలయన్స్ స్టోర్‌లలో ఈ సదుపాయం ఉందో లేదో చెక్ చేసుకోండి.
* రానున్న రోజుల్లో ఈ సర్వీస్ అన్ని నగరాల్లో అందుబాటులో తీసుకురానున్నారు. జియో సిమ్ కార్డ్‌లను పొందే క్రమంలో యూజర్ తన ఆధార్ కార్డ్‌తో పాటు పాస్‌పోర్ట్ సైజ్ కలర్ ఫోటోను సమీపంలోని రిలయన్స్ స్టోర్‌కు తీసుకువెళితే సరిపోతుంది.
* యూజర్ తన ఆధార్ కార్డ్ ద్వారా జియో సిమ్‌ను పొందిన 15 నిమిషాల వ్యవధిలోనే యాక్టివేషన్ ప్రక్రియను పూర్తి చేసేందుకు ఈ ఇన్‌స్టెంట్ e-KYC activation సర్వీస్ దోహదపడుతుందని ముఖేశ్ అంబానీ తెలిపారు.

LIKE AND SHARE IF YOU LIKE THIS POST