వాడిపారేసిన ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల పై ఓ కెమెకిల్‌ను ప్రయోగించి ఏడాదికి ఏకంగా 300 టన్నుల బంగారాన్ని రాబడుతున్నట్లు ఓ సర్వే నిగ్గు తేల్చింది. పాత గాడ్జెట్‌ల నుంచి బంగారాన్ని వెలికితీసేందుకు అనుసరిస్తోన్న ప్రస్తుత పద్ధతలు చాలా ప్రమాదంతో కూడుకుని ఉన్నాయని బ్రిటన్‌కు చెందిన ఎడిన్బర్గ్ విశ్వవిద్యాలయ పరిశోధకులు చెబుతున్నారు.
పాత పద్ధతుల్లో భాగంగా ఫోన్‌ల నుంచి బంగారాన్ని సేకరించేందుకు cyanide వంటి ప్రమాదక కెమికల్స్‌ను వాడవల్సి ఉంటుందని వీరు చెబుతున్నారు. సైనైడ్ వంటి కెమికల్స్ మనిషి ఆరోగ్యానికి చాలా హానీ కలిగిస్తాయి. వీటిలో ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా ప్రాణాలు కోల్పొవటం తద్యం.
భవిష్యత్‌లో ఇటువంటి టాక్సిక్ కెమికల్స్ జోలికి పోకుండా సాధారణ వెలికితీత పద్ధతుల ద్వారా బంగారాన్ని సేకరించేందుకు సరికొత్త మార్గాన్ని కొనుగొన్నట్లు ఎడిన్బర్గ్ స్కూల్ ఆఫ్ కెమిస్ట్రీ ప్రొఫెసర్ జాసన్ లవ్ తెలిపారు. రసాయన శాస్త్రం ఆధారంగా కొనగొనబడిన సరికొత్త కాంపౌండ్ ద్వారా ఎటువంటి ప్రమాదం లేకుండా గాడ్జెట్‌లను నుంచి బంగారం వంటి విలువైన లోహాలను వెలికితీయవచ్చని శాస్తవేత్తలు చెబుతున్నారు. ఈ పద్ధతిలో భాగంగా ముందుగా ఆయా గాడ్జెట్‌లకు సంబంధించిన ప్రింటెండ్ సర్క్యూడ్ బోర్డ్‌లను తేలికపాటి యాసిడ్‌లో ఉంచుతారు. ఈ యాసిడ్ సర్క్యూడ్ బోర్డ్‌లోని అన్ని లోహపు భాగాలను కరిగిస్తుంది. ఇప్పుడు శాస్త్రవేత్తలు రూపొందించిన ప్రత్యేకమైన కెమికల్ కాంపౌండ్ సహాయంతో కరిగిన ధ్రవం నుంచి బంగారం వంటి విలువైన లోహాలను వేరు చేస్తారు.
పాత ఐఫోన్‌ల నుంచి గతేడాది ఆపిల్ కంపెనీ దాదాపు టన్ను బంగారాన్ని
సేకరించినట్లు సమాచారం. ఐఫోన్‌ల నుంచే కాకుండా మాక్‌బుక్స్, ఐపాడ్స్ నుంచి
బంగారం రాబట్టుకుంటుందోని కంపెనీ వార్షిక పర్యావరణ రిపోర్ట్ తెలిపింది.
మరీ ఫోన్ నుంచి బంగారం తీయడం ఎలా సాధ్యం అవుతుందని అనుకోవచ్చు
కదా..తలుచుకుంటే ఏదైనా సాధ్యమేనని చెబుతోంది ఆపిల్ కంపెనీ.
తన పాత ఐఫోన్లను రీసైక్లింగ్ చేయడం ద్వారా బంగారం..ఇతర మెటల్స్ ను ఐఫోన్ సమకూర్చుకుంటుంది. అంటే..మొత్తం స్క్రాప్ నుంచి మాత్రమే కాదు.. కొత్త వాటిని కూడా కొనుగోలు చేస్తుంటారు. పాత గాడ్జెట్లను, ఫోన్లను రీసైక్లింగ్ చేసి, బంగారాన్ని తీసుకుంటుందట. సగటున ఒక్కో ఐఫోన్ తయారీలో 30 మిల్లీ గ్రాముల బంగారం ఉపయోగిస్తారు. గతేడాది ఇలా దాదాపు 2,204 పౌండ్ల (టన్ను కంటే ఎక్కువ) బంగారాన్ని ఐఫోన్లను, ఐపాడ్లను, ఐమాక్లను పగలగొట్టి రీసైక్లింగ్ చేసుకుందని కంపెనీ వార్షిక పర్యావరణ రిపోర్టులో తెలిపింది.
అయితే.. వాడేసిన ఫోన్ల నుంచి యాపిల్ సేకరించిన బంగారం బరువు ఎంతో తెలుసా? అక్షరాల వెయ్యి కిలోలు. తాజాగా కంపెనీ వార్షిక పర్యావరణ నివేదికను పరిశీలిస్తే ఈ విషయం బయటకు వచ్చింది. వీటి విలువ దాదాపు 40 మిలియన్ డాలర్లు ఉంటుందని అంచనా. ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులు తుప్పు పట్టకుండా, ఎక్కువ కాలం పనిచేసేలా, అద్భుతమైన విద్యుత్ వాహకంలా బంగారం ఉపయోగపడుతుంది.
వెండిని, రాగిని కూడా ఈ ఉత్పత్తుల్లో వాడతారు. అయితే అవి త్వరగా తుప్పు పట్టి, పాడయ్యే అవకాశాలు అధికంగా ఉండడం, అతి ముఖ్యమైన వేళ ఎలక్ట్రాన్లను మెల్లగా ప్రయాణించేలా చేయడం వల్ల వీటిని గ్యాడ్జెట్లలో తక్కువగా వాడతారు.
IF YOU LIKE THIS POST PLEASE LIKE AND SHARE...!!
YOU CAN TRANSLATE THIS POST TO YOUR PREFFERD LANGUAGE
CLICK TRANSLATE TAB ON MY BLOG